![]() |
![]() |
.webp)
కార్తీక దీపం సీరియల్ పార్ట్ 1 ఎంత దుమ్ము రేపిందో అందరికీ తెలుసు. సాయంత్రం ఐతే చాలు స్టార్ మాలో వచ్చే ఈ సీరియల్ కోసం ఆడియన్స్ తెగ ఎదురు చూసేవాళ్ళు. ఈ సీరియల్ శౌర్య పాప చాలా ఫేమస్. ఇందులో ఆమె వంటలక్క - డాక్టర్ బాబు కూతురిగా నానమ్మను దబాయించే మానవరాలిగా నటించింది. ఈమె నటన ఆడియన్స్ కి తెగ నచ్చేసింది. శౌర్య అసలు పేరు కృతిక. ఒక పక్కన చదువుకుంటూనే సీరియల్స్ లో నటిస్తోంది. అలాంటి కృతిక ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఇంటర్ 1 స్ట్ ఇయర్ మార్క్స్ షీట్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. "నా ఆనందాన్ని మీతో ఇలా షేర్ చేసుకోవడం సంతోషంగా ఉంది. మీ అందరి ప్రేమకు, అభిమానానికి ధన్యవాదాలు " అని చెప్పింది. ఇక ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల్లో 470కి గాను 459 మార్కులను సాధించింది.
ఇక ఒక్కో సబ్జెక్టుకి మర్క్స్ చూస్తే ఇంగ్లీష్ 94 /100, సంస్కృతం 99 / 100 , మ్యాథ్స్ ఏ 73 / 75, మ్యాథ్స్ బి 74 /75 , ఫిజిక్స్ 60 /60 , కెమిస్ట్రీ 59 /60 మార్కులు సాధించింది. ఇక నెటిజన్స్ అంతా ఈ మార్క్స్ చూసి కంగ్రాట్యులేషన్స్ చెప్తున్నారు. కొంతమంది కృతిక అంటూ ఇంకొంతమంది శౌర్య అని పిలుస్తూ కామెంట్ చేస్తున్నారు.
![]() |
![]() |